ఊపిరాడకుంటె కాని గాలి విలువ తెలియదు
చీకటావహిస్తె కాని చూపు విలువ తెలియదు
గుండె పగిలితే కాని మనసు విలువ తెలియదు
ఒంటరయితె కాని తోడు విలువ తెలియదు
గతం తవ్వుకుంటె కాని కాలం విలువ తెలియదు
ఓడిపోతెనె కాని ఆలింగనం విలువ తెలియదు
గొంతెండితె కాని వాన విలువ తెలియదు
కడుపు మాడితే కాని రైతు విలువ తెలియదు
దూరమైతె కాని ప్రేమ విలువ తెలియదు
కష్టమెదురైతె కాని స్నేహం విలువ తెలియదు
కొలిమి మంట తాకితె కాని పసిడి కాంతి తెలియదు
ప్రశంశించె మనసుంటే కాని కళల విలువ తెలియదు
ఊత కర్ర చేత పడితె కాని సేవ విలువ తెలియదు
ఆత్మీయుల చిరునవ్వు కంటే కాని తృప్తి విలువ తెలియదు
మునిగి తేలిననాడే లోతు విలువ తెలుస్తుంది
అవకాశం కోల్పోయిననాడే నిరాశ విలువ తెలుస్తుంది
గెలుపు చూసిననాడే పడిన శ్రమ విలువ తెలుస్తుంది
వ్యక్తపరచలేని నాడే మాట విలువ తెలుస్తుంది
భంగపడిననాడే తప్పు విలువ తెలుస్తుంది
పరిపూర్ణత సిద్ధించిన నాడే సాధన విలువ తెలుస్తుంది
కోల్పోయినది దక్కిన నాడే సంతోషము విలువ తెలుస్తుంది
తృటిలో గమ్యం చేజారిననాడే సమయం విలువ తెలుస్తుంది
ఎదురుదెబ్బ తగిలిన నాడే మంచితనం విలువ తెలుస్తుంది
దొడ్డ శిష్యుడున్న నాడె గురువు విలువ తెలుస్తుంది
భాధ పడిన క్షణంనాడే బ్రతుకు విలువ తెలుస్తుంది
అదరణ కరువైన నాడే బంధం విలువ తెలుస్తుంది
నిలువ నీడ లేనినాడే సాయం విలువ తెలుస్తుంది
ఏకాకిగ నడిచిన నాడే దూరం విలువ తెలుస్తుంది
విలువ తెలిసి నడుచుకొనుటయె జీవన పరమార్థం
జన్మ విలువ తెలుసుకోగ కర్మఫలము తరుగుతుంది
Leave a Reply