కర్మ ఫలం

ఈ జీవితమంతా కర్మ ఫలమే. కర్మానుసారమే మన చుట్టూ ఉన్న ఈ జగత్తు అనే భవబంధనాలు. ఆత్మ తన నిజస్వభావాన్ని తెలుసుకోవడానికి కర్మానుష్టానుసారంగా సహకరించేవే సుఖదుఃఖాలు, శత్రుమిత్రులు, సంబంధబాంధవ్యాలు, మానావమానాలు.

మన కర్మానుభవమునకు అనుగుణంగా అవసరం ఉన్న విధంగా ‘మాయ’ మన చుట్టూ ఈ జగత్తు రూపేణ ఆవరించి ఉంది. అందుకే కర్మ సన్యాసం చేయటం దుస్సాధ్యం. దీనికి కర్మ ఫల త్యాగము / నిశ్కామకర్మము ఒక మంచి సులభమైన మార్గం.

సత్సంగత్వముచే నిస్సంగత్వం
నిస్సంగత్వముచే నిర్మోహత్వం
నిర్మోహత్వముచే నిశ్కామకర్మ
నిశ్కామకర్మచే జీవన్ముక్తి

ఈ సత్సంగత్వము కూడా ప్రారబ్ద కర్మ ఫలమే. కర్మను సంచిత, ప్రారబ్ద , ఆగామి అని మూడు విధాలుగా చూడవచ్చు. సంచిత కర్మ బ్యాంకులో అకౌంట్ బ్యాలెన్స్ అనుకుంటే, ప్రారబ్ద కర్మ ఏటీయం నుంచి మనం తీసుకున్న ధనము మరియు ఆగామి కర్మను ఆ ధనముతో ఇప్పుడు మనము చేసే పనిగా భావించవచ్చును. ఈ ఆగామి కర్మఫలమే తిరిగి సంచిత కర్మగా మారి, కాలచక్రములో ఆత్మని బందీగా ఉంచియున్నది‌.

ప్రారబ్ద ఫలం వదులుట జీవన్ముక్తులకు కూడా అసాధ్యం. సంచిత, ఆగామి కర్మ ఫల త్యాగమే ఈ మాయ నుండి త్వరగా ముక్తి కలిగించే ఉపాయం.

జ్ఞాన వైరాగ్యం లచే ఇది సాధ్యం అయినా, భక్తి శరణాగతులు సులభ మార్గాలు.

నీవే శరణమని నమ్మితి
నీవే మము బ్రోవు మొక రీతి
నీవే శరణమని నమ్మితి

ఈ ఇల లోన నీకెవరు సాటి
నా హృదయమున నీవె ఘనపాటి
నీవే శరణమని నమ్మితి

శరణాగతి అందుకోవయ్య
నీకన్న నాకు శరణ మెవరయ్య
నీవే శరణమని నమ్మితి

నీ చరణములె ద్వారకా కాశీ
నా హృదయమున నీవె నివాసి
నీవే శరణమని నమ్మితి

– కోవూరు వెంకటేశ్వర్ రావు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: