హనుమా

రామ నామము వినిన యంత
చేరును హనుమాను చెంత

రవీ ప్రియ శిష్య హనుమా
రవికుల ప్రియ మిత్ర హనుమా

సాగరము లంఘించె హనుమా
అసుర సేనల త్రుంచె హనుమా

సంజీవినీ తెచ్చె హనుమా
సౌమిత్రినీ బ్రతికించె హనుమా

రామునీ ప్రియ భక్తుడు
భరతునీ సమ భ్రాత్రుడు

రచన : కోవూరు వెంకటేశ్వర రావు

హనుమ

రామ నామము విన్న చాలును
రోమ రోమము నిక్క బొడుచును

పవన సుతుడీ హనుమాను
మరు కల్ప బ్రహ్మ్ అవును

రాముని దూత ఈతడు
భక్తుల చేయూత ఈతడు

మనసు నిండా రాముడు
సర్వ గుణ సంపన్నుడు

రుద్రుని అంశ హనుమ
రామభద్రుని బంటు హనుమ

శక్తి యుక్తుల మేరు హనుమ
భక్తి జ్ఞాన వైరాగి హనుమ

రచన : కోవూరు వెంకటేశ్వర రావు

in english

అంతర్యామి

మానవ శరీరమనే ఈ పాలకుండలో భక్తి అనే మజ్జిగ కలిపి, దానిని నిష్కామ కర్మ అనే కవ్వంతో చిలికి, జ్ఞానం అనే అగ్నితో మరిగించి నప్పుడు ఈ మాయ ఆవరించిన ఆత్మ అనే పాలలో నిగూఢమై అంతర్యామిగా ఉన్న నెయ్యి అనే బ్రహ్మ తత్వం మనకు స్పష్టంగా కనిపిస్తుంది.

Every story mythological or otherwise, including chats with friends and family, are prone for different interpretations by different people.

We interpret the same story  in our own way using our own individual filters of intellect, physical, cultural, Continue reading

Create a website or blog at WordPress.com

Up ↑