కోతిగోల

ఏమటీి కోతిగోల యని లక్ష్మన్న అలుగుట
సబబు కాదని చెప్పె రామచంద్రుడు

అలనాడు లంకలో సంజీవినీ తెచ్చినది
ఒక కోతియని మరచుట పాడి కాదనియె

హలో లక్ష్మణా..
మైరావణుని ఘటన మరవకుమయ్య

పురాణము నీవు కాదనుకున్న
సైన్సు కూడను కోతిని వదలదయ్యె

వానరుండు లేక నరుడే లేడని చెప్పె
డార్విన్ మహాశయుడు అతిశయమ్మున

కోతిగోల యని కోపగించకు లక్ష్మణా
కోతియె ఈ జగమున రేపటి బ్రహ్మ కదరా

రచన : కోవూరు వెంకటేశ్వర రావు

Leave a comment

Create a website or blog at WordPress.com

Up ↑