ॐ त्र्यम्बकं यजामहे
सुगन्धिं पुष्टिवर्धनम् ।
उर्वारुकमिव बन्धनान्
मृत्योर्मुक्षीय मामृतात् ॥

ఓం త్రయంబకం యజామహే
సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్
మృత్యోర్ ముక్షీయ మామృతాత్

ఉర్వారుక మివ బంధనం అంటే…..

ఇసుకలో ఆడుకొంటున్న పిల్లల్ని చూస్తుంటాం. అద్భుతంగా గుడి కడతారు. తీరికగా అలంకారాలు అద్దుతారు. తోచినంతసేపు హాయిగా ఆడుకుంటారు. పొద్దు వాలేటప్పటికి, ఆ కట్టడాలన్నింటినీ చటుక్కున కూలదోస్తారు. కిలకిల నవ్వులతో

Continue reading

ఆచార్య దినోత్సవ శుభాకాంక్షలు

సనాతన ధర్మాచరణలో ముఖ్యమయినది కర్మానుష్టానము.

ఈ కర్మానుష్టానమునకు ఉపకరణము దశేంద్రియ మనోబుద్ధ్యహంకారచిత్తమైన భౌతికకాయము.

దీనికి సంస్కరణపరులు మాతాపితృలు, ఆచార్యులు, బంధువులు, సన్నిహితులు, అతిథులు.

వీరంతా సదా మాననీయులు.

🙏🙏

తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పినట్లు

Continue reading “ఆచార్య దినోత్సవ శుభాకాంక్షలు”

Hit Refresh

My in-laws were moving to another home. I enquired with my mother-in-law about the progress of the packing. She said it is pretty much done since a lot of junk that got piled up over the years has been discarded. She was happy that the moving process helped them clear unnecessary junk that got piled up over the years.

Isn’t it the same with our lives in general as well?

Continue reading “Hit Refresh”

కర్మ ఫలం

ఈ జీవితమంతా కర్మ ఫలమే. కర్మానుసారమే మన చుట్టూ ఉన్న ఈ జగత్తు అనే భవబంధనాలు.

మన ఆత్మ తన నిరంతర యాత్రలో నిజస్వభావాన్ని తెలుసుకోవడానికి ధరించిన ఈనాటి వస్త్రమే ఈ దేహం.

ప్రస్తుత పరిస్థితుల్లో కర్మానుష్టానమునకు అవసరమైన రీతిలో జన్యురూపమైన ఈనాటి దేహం రూపొందించబడింది.

ఈ శరీరముతో పాటుగా మనకు లభించినవే ఇంటి పేరు అయినా, వంటి ధారుఢ్యమైనా.

అశాశ్వతమైన ఆస్తులు, సుఖదుఃఖాలు, శత్రుమిత్రులు, సంబంధబాంధవ్యాలు, మానావమానాలు అన్నీ కర్మఫలమే.

ఇవన్నీ కర్మానుష్టానము కోసం ఆత్మ ఏర్పాటు చేసికొన్న పనిముట్లు మాత్రమే.

ఈ యాత్ర ముగిసిన వెంటనే ఇవన్నీ వదలాల్సినవే.

మన కర్మానుభవమునకు అనుగుణంగా అవసరం ఉన్న విధంగా ‘మాయ’ మన చుట్టూ ఈ జగత్తు రూపేణ ఆవరించి ఉంది.

భక్తి, జ్ఞాన, కర్మ, వైరాగ్య, రాజ యోగములు మన ఈ జీవన యాత్ర మార్గాలు.

– కోవూరు వెంకటేశ్వర్ రావు

To my telugu friends living in Houston city in USA currently under the nature’s fury with Harvey storm.

భాగవతమున కనలేదా
బాల కృష్ణుని మధురలీల

Continue reading

హనుమా

రామ నామము వినిన యంత
చేరును హనుమాను చెంత

రవీ ప్రియ శిష్య హనుమా
రవికుల ప్రియ మిత్ర హనుమా

సాగరము లంఘించె హనుమా
అసుర సేనల త్రుంచె హనుమా

సంజీవినీ తెచ్చె హనుమా
సౌమిత్రినీ బ్రతికించె హనుమా

రామునీ ప్రియ భక్తుడు
భరతునీ సమ భ్రాత్రుడు

రచన : కోవూరు వెంకటేశ్వర రావు

హనుమ

రామ నామము విన్న చాలును
రోమ రోమము నిక్క బొడుచును

పవన సుతుడీ హనుమాను
మరు కల్ప బ్రహ్మ్ అవును

రాముని దూత ఈతడు
భక్తుల చేయూత ఈతడు

మనసు నిండా రాముడు
సర్వ గుణ సంపన్నుడు

రుద్రుని అంశ హనుమ
రామభద్రుని బంటు హనుమ

శక్తి యుక్తుల మేరు హనుమ
భక్తి జ్ఞాన వైరాగి హనుమ

రచన : కోవూరు వెంకటేశ్వర రావు

in english

అంతర్యామి

మానవ శరీరమనే ఈ పాలకుండలో భక్తి అనే మజ్జిగ కలిపి, దానిని నిష్కామ కర్మ అనే కవ్వంతో చిలికి, జ్ఞానం అనే అగ్నితో మరిగించి నప్పుడు ఈ మాయ ఆవరించిన ఆత్మ అనే పాలలో నిగూఢమై అంతర్యామిగా ఉన్న నెయ్యి అనే బ్రహ్మ తత్వం మనకు స్పష్టంగా కనిపిస్తుంది.

Every story mythological or otherwise, including chats with friends and family, are prone for different interpretations by different people.

We interpret the same story  in our own way using our own individual filters of intellect, physical, cultural, Continue reading

There are so many debates in the world about idol worship and even wars are fought throughout the history.Those against idol worship feel compelling need to correct others even by using brute force.

At the crux of all religions, the form of God Continue reading

Create a website or blog at WordPress.com

Up ↑