హనుమా

రామ నామము వినిన యంత
చేరును హనుమాను చెంత

రవీ ప్రియ శిష్య హనుమా
రవికుల ప్రియ మిత్ర హనుమా

సాగరము లంఘించె హనుమా
అసుర సేనల త్రుంచె హనుమా

సంజీవినీ తెచ్చె హనుమా
సౌమిత్రినీ బ్రతికించె హనుమా

రామునీ ప్రియ భక్తుడు
భరతునీ సమ భ్రాత్రుడు

రచన : కోవూరు వెంకటేశ్వర రావు

Leave a comment

Create a website or blog at WordPress.com

Up ↑