అత్యంత శుభప్రదమైన వసంత ఋతువు , చైత్ర పూర్ణిమ రోజున ఆ హనుమని తలుచుట ఆనందమయం 🙏
ఈ శుభవేళ నా మదిన మెదిలిన విషయము …
హనుమ సాగరమధ్యనే కాదు, మనస్సుల మధ్యన కూడా వారధి నిర్మించగల సమర్థుడు.. హనుమ మంచి అనుసంధాన కర్త
రుద్రఅంశతో పుట్టి, వైష్ణవాంశఅయిన రాముని సన్నిహితుడై, భావి బ్రహ్మగా మారి సకల దేవతారాధన అనుసంధాన పరిచిన అగ్రగణ్యుడు
భక్తాగ్రేసరుడు, రాముని సేవయే తన కర్మయోగ మన్నవాడు, జ్ఞానంలో పరాకాష్టయైన హనుమ భక్తి, కర్మ, జ్ఞాన యోగముల మూడింటి అనుసంధాన కర్త
రామ సేవలో తరించిన ద్వైతిగా, తన ప్రతి రోమమున రాముని చూపి రామునిలో విలీనమైన విశిష్టాద్వైతిగా, తన దైవమైన రామునకు తనకు భేదమేలేదని ఆ రామునినే తనలో చూపిన అద్వైతిగా హనుమ త్రిమత అనుసంధాన కర్త
అత్యంత బలశాలి అయినా అణుకువతో ఉంటూ, ధర్మానికి రక్షణ అవసరమైనప్పుడు రణరంగ ధీరుడై రుద్రుడై
అరివీర భయంకరుడై శత్రు నాశనం చేయాలని చూపిన అనుసంధాన కర్త
జయఘోష
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః |
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ||
Leave a comment